సత్యదేవ గో సంరక్షణ ట్రస్టులో డిపాజిట్లపై రూ.కోటి ఆదాయం వస్తూండగా ఆవుల మేత, ఇతర అవసరాలకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు.
ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వ్యయాల్లో భారీ కోత
బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల వ్యయాల్లో భారీ కోత విధించారు. గత రెండేళ్లలో ఇంజినీరింగ్ విభాగంలో రూ.20 కోట్లు ఖర్చు చేశారు. దీంతో గత నవంబర్ నెలకే బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. ఇంకా సుమారు రూ.3 కోట్లు చెల్లింపులు, చేపట్టాల్సిన పనులు మిగిలాయి. దీంతో వీటికి నిధులివ్వాలని సప్లిమెంటరీ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎలక్ట్రికల్ విభాగానికి కూడా రూ.కోటి మాత్రమే కేటాయించారు.
పేరుకుపోయిన
సీజీఎఫ్ బకాయిలు
గత ఏడాది కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) చెల్లింపులు రూ.16 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు, ఈ ఏడాది చెల్లింపులకు కలిపి బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.25 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment