రావులపాలెం: క్రీడలతో విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుకోవాలని డాన్‌బాస్కో ప్రిన్సిపాల్ ఐ.బల్తాజార్ అన్నారు. రాష్ట్ర స్థాయి పదో జూనియర్ నెట్‌బాల్ పోటీలు ఆదివారం డాన్‌బాస్కో స్కూల్ ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బల్తాజార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అండర్ –19 విభాగంలో 13 జిల్లాలకు చెందిన బాల బాలికలు సుమారు 350 మంది నెట్‌బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్టు నెట్‌బాల్ రాష్ట్ర అసోసియేషన్ సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. లీగ్ కం నాకౌట్ విధానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్‌బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. బాలుర, బాలికల విభాగాల్లో 11 జట్లు లీగ్ దశలో పాల్గొంటాయన్నారు.
రావులపాలెంలో ప్రారంభమైన
రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment