చికిత్స పొందుతూ సర్పంచ్ మృతి
పి.గన్నవరం: ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి తాడేపల్లిగూడెం నుంచి మోటార్ సైకిలుపై ఇంటికి వస్తూ బెల్లంపూడి వద్ద ప్రమాదానికి గురైన ఎల్.గన్నవరం గ్రామ సర్పంచ్ పసలపూడి రామకృష్ణ (46) రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి వస్తున్న రామకృష్ణ బెల్లంపూడి వద్ద ప్రమాదవశాత్తూ పంట బోదెలో పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన రామకృష్ణను స్థానికులు పంట బోదెలోనుంచి బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటి నుంచి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సర్పంచ్‌కు భార్య సీతారత్నం, కుమారుడు పవన్ వెంకట సాయి, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment