
రెండు బైక్‌ల ఢీ
ఆలమూరు/ కడియం: మండలంలోని మడికి నుంచి దుళ్ల వెళ్లే రహదారిలో రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్లకు చెందిన గంటి రాజు (33), కుమారి దంపతులు తమ వ్యక్తిగత పనిపై కొత్తపేట మండలం మందపల్లి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక షణ్ముక నర్సరీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో మళ్లీ వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త రాజు మృతి చెందగా, భార్య కుమారి మృత్యువుతో పోరాడుతుంది. ఢీకొట్టిన బైక్ యజమానికి కూడా తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై అశోక్ తెలిపారు.
నాన్న లేడని ఎలా చెప్పేది
వివాహానికి వెళ్లి పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందగా, అతని భార్య కుమారి ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేశవరంలోని ఒక ప్రైవేటు కూల్ డ్రింక్ కంపెనీలో పనిచేస్తూ గంటి రాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమార్తె ఉంది. ఇంటి వద్ద పాపను వదిలి భార్యతో కలిసి రాజు మందపల్లిలో వివాహానికి శనివారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఉన్న రెండేళ్ల చిన్నారికి నాన్న ఎక్కడని అడిగితే ఏమని చెప్పాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రి మృత్యువాత పడి, తల్లి ఆసుపత్రిలో ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి.
ఫ ఒకరి మృతి ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైక్‌ల ఢీ
Comments
Please login to add a commentAdd a comment