
తెలుగులో తొమ్మిది సూత్రాలు
తెలుగులో అవగాహన– ప్రతి స్పందనపై నాలుగు ప్రశ్నల ద్వారా 32 మార్కులు సాధించవచ్చు. వ్యక్తీకరణ – సృజనాత్మకత నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు మూడు వస్తాయి. వీటి ద్వారా 36 మార్కులు పొందవచ్చు. ప్రధానంగా పద్యభాగంలో కవి పరిచయాలు, గద్యభాగంలో ప్రక్రియలు, రామాయణంలో పాత్రలు చదవడం ద్వారా 12 మార్కులు సాధించవచ్చు. 8వ ప్రశ్నగా కేవలం పద్యభాగ సారాంశాలు, 9వ ప్రశ్నగా రామాయణం, 10వ ప్రశ్నగా సృజనాత్మకత (లేఖ, కరపత్రం) ద్వారా 24 మార్కులు పొందవచ్చు. 32 మార్కులను కేవలం పాఠ్య పుస్తకం వెనుక ఉన్న అభ్యాసాల ద్వారా సాధించవచ్చు. అవగాహన ప్రతిస్పందన నుంచి పరిచిత పద్యం ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు మాత్రమే ఇస్తారు.
– జి.ప్రభావతి, పాఠ్య పుస్తక రచయిత్రి,
జెడ్పీహెచ్‌ఎస్, సఖినేటిపల్లిలంక
బయాలజీలో ఈజీగా..
మారిన సిలబస్‌ను అనుసరించి బయాలజీ ప్రశ్న పత్రం 50 మార్కులకు 17 ప్రశ్నలతో ఉంటుంది. జవాబులు రాసే ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. సెక్షన్–4లో ప్రయోగాలపై 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల జీవక్రియలు పాఠంపై అవగాహన అవసరం. అనువంశికత పాఠం నుంచి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఈ రెండు పాఠ్యాంశాలు బాగా చదివితే 16 మార్కులు తప్పనిసరిగా పొందవచ్చు. సెక్షన్–3లో ఒక డయాగ్రామ్ వస్తుంది. ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఒక డయాగ్రామ్ తప్పనిసరిగా వస్తుంది.
–మేకా రామలక్ష్మి, డీసీఈబీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్,
ఎస్‌జీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, మండపేట

తెలుగులో తొమ్మిది సూత్రాలు
Comments
Please login to add a commentAdd a comment