
అడుగులేద్దామిలా..
ఇంగ్లిషు ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. గ్రామర్, ఒకాబ్యులరీపై అధికంగా సాధన చేయాలి. సెక్షన్–ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, సెక్షన్–బీలో గ్రామర్ అండ్ ఒకాబ్యులరీ, సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్ ఉంటాయి. సెక్షన్–ఏలో 30 మార్కులకు 24 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఆరు సాధారణ ప్రశ్నలుంటాయి. పేరాను బాగా చదివి అర్థం చేసుకుంటే కచ్చితంగా 24 మార్కులు స్కోర్ చేయవచ్చు. పాఠ్య పుస్తకాల చివర ఇచ్చే గ్రామర్‌ను బాగా చదివితే 25 మార్కులు ఈజీగా సాధించవచ్చు. క్రియేటివ్ రైటింగ్‌లో లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, స్పీచ్, డైరీ ఎంట్రీ, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్రశ్నలు, పేరాగ్రాఫ్ రైటింగ్ ప్రశ్నలకు బాగా సాధన చేయాలి. కొత్త సిలబస్‌తో పాటు, నూతన విధానంలో ప్రశ్నపత్రం ఇస్తారు. నౌన్ మోడిఫయర్స్ కొత్తగా ప్రవేశపెట్టారు.
– ఆర్.వెంకటేశ్వరరావు, జెడ్పీ హెచ్‌ఎస్,
భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం
గణితానికి ఓ లెక్కుంది
గణిత భావనలు బాగా అవగాహన చేసుకుని సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరొకటి ఉండదు. 1, 3, 7, 13, 14 అధ్యాయాలను బాగా అధ్యయనం చేస్తే ప్రతి విద్యార్థి కచ్చితంగా 60 మార్కులు పొందే వీలుంది. ఈ ఐదు చాప్టర్లు గణితంలో పంచరత్నాలుగా భావించాలి. ఈ చాప్టర్ల నుంచే సులభమైన 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు మిగిలిన అధ్యాయాల్లో 1, 2, 4 మార్కుల ప్రశ్నలపై పట్టు సాధిస్తే 100 మార్కులు సులభంగా స్కోర్ చేయవచ్చు.
–టీఎస్‌వీఎస్ సూర్యనారాయణమూర్తి
(గణితావధాని),
జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, అమలాపురం

అడుగులేద్దామిలా..
Comments
Please login to add a commentAdd a comment