
గల్ఫ్ దోపిడీకి చెక్ పెట్టేందుకు హెల్ప్‌డెస్క్
అమలాపురం రూరల్: గల్ఫ్ దేశాలలో ఉపాధి లభిస్తే ఆర్థికంగా కుటుంబాలు నిలదొక్కుకునే అవకాశం ఉంటుందన్న ఆశతో అప్పు చేసి ఏజెంట్లు చేతిలో డబ్బు పెట్టి మోసపోతున్నారని, అటువంటి బాధితుల కోసం కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారు. వెళ్లి మోసపోయిన వారు, ఏజెంట్లతో గల్ఫ్ ఉద్యోగాలపై మంగళవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏజెంట్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు హెల్ప్‌డెస్క్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆరు మాసాలుగా నిరుద్యోగుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. కలెక్టరేట్‌లో15 రోజుల్లో ఏడుగురు సిబ్బందితో హెల్ప్ డెస్క్ ప్రారంభిస్తామన్నారు. ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ ఈ హెల్ప్ డెస్క్ యువతకు వరంగా నిలుస్తుందన్నారు. వలసదారుల రక్షణ చట్టం హైదరాబాద్ ప్రతినిధి అంగర రవికుమార్, డీఆర్‌డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, వికాస పీపీ కె.లచ్చారావు, డీఎస్‌డీఓ హరి శేషు, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ పాల్గొన్నారు.
పరిష్కారాలు చూపాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై స్పందించి సకాలంలో పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి భూ పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంశాలపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment