
క్రీడలతోపాటు క్రమశిక్షణ
ముసలయ్యను సత్కరిస్తున్న డీఈవో సలీంబాషా
పీఈటీల సెమినార్‌లో జేసీ నిషాంతి
సాక్షి, అమలాపురం: పాఠశాల విద్యార్థులకు క్రీడలు నేర్పించడమే కాకుండా క్రమశిక్షణ అలవరచడంలో వ్యాయామోపాధ్యాయుల పాత్ర కీలకమని, వారు తమ వృత్థికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తే దేశానికి ఆరోగ్యవంతమైన మంచి విద్యార్థులను అందించిన వారవుతారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో జిల్లాస్థాయి వ్యాయామోపాధ్యాయుల సెమినార్ మంగళవారం జరిగింది. జిల్లా ఏర్పడిన తరువాత నూతన ఓరవడికి నాంది పలుకుతూ వ్యాయామ విద్య ఆవశ్యకతను తెలియజేసేందుకు నిర్వహించిన సెమినార్‌కు జిల్లాస్థాయిలో 237 మంది హాజరయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్.రాజకుమారి మాట్లాడుతూ విద్యతో పాటుగా క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. అమలాపురం ఆర్డీవో కె.మాధవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామానికి సమయం కేటాయించాల్సి ఉందన్నారు. కొంతమంది రెగ్యులర్ పీఈటీలు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పీఈటీలు పద్ధతి మార్చుకోవాలని డీఈవో సలీంబాషా సూచించారు. సమయపాలన, విధి నిర్వహణలో అలసత్వం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లా రెండవ అదనపు జడ్జి వి.నరేష్, ఉప విద్యా శాఖ అధికారి పి.వి.సుబ్రహ్మణ్యం, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి అడబాల శ్రీనివాస్, పీఈటీల సంఘం ప్రతినిధులు సీహెచ్.వి.ఎస్.ప్రసాద్, బి.ఎస్.ఎన్.మూర్తి, ఉండ్రు ముసలయ్య పాల్గొన్నారు.
పీడీ ముసలయ్యకు సన్మానం
అమలాపురం రూరల్: ఈ నెల 28న పదవీ విరమణ చేస్తున్న అల్లవరం మండలం కొడూరుప్పాడు ఉన్నత పాఠశాల పీడీ ముసలయ్యను డీఈవో బాషాతో పాటు వ్యాయామోపాధ్యాయుల సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ అమలాపురం వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షునిగా ముసలయ్య విలువైన సేవలు అందించారన్నారు. ఎంతోమంది పాఠశాల విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ముసలయ్య జిల్లాలో జరిగిన పలు క్రీడా పోటీలలో ముఖ్య భూమిక పోషించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment