
‘తెలుగు వ్యాకరణం’ పుస్తకావిష్కరణ
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన కవి, శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి రచించిన ‘తెలుగు వ్యాకరణం’ పుస్తకాన్ని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి (డీఐఈవో) వనుము సోమశేఖరరావు మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల తన కార్యాలయంలో డీఐఈవో సోమశేఖరరావు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి పుస్తక రూపకర్త నరసింహమూర్తిని అభినందించారు. ఆ పుస్తకాన్ని సమీక్షించిన డీఐఈవో సోమశేఖరరావు మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ వ్యాకరణ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్న నరసింహమూర్తి అభినందనీయుడన్నారు. తెలుగు అధ్యాకునిగానే కాకుండా కవిగా, సాహితీవేత్తగా నరసింహరావు నాలుగు దశాబ్దాలుగా తెలుగు భాష వికాసానికి తన వంతు కృషి చేస్తున్నారని చెప్పారు. పుస్తక రూపకర్త నరసింహరావు మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు పద్యాలు, పద్య భావాలు, పద దోషాలు, ఏక వాక్య పద రూప సమాధానాలు ఈ పుస్తకంలో రూపొందించినట్టు తెలిపారు.
బాలాజీ హుండీ ఆదాయం
రూ.43.30 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. స్వామివారికి హుండీల ద్వారా 68 రోజులకు రూ.43,30,182 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. 13 గ్రాములు బంగారం, 130 గ్రాములు వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం దేవదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. బ్యాంకు ఉద్యోగులు, స్థానికులు, ఆలయ ఉద్యోగులు, పలు సంస్థలకు చెందిన సేవకులు లెక్కింపులో పాల్గొన్నారు.

‘తెలుగు వ్యాకరణం’ పుస్తకావిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment