గత మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణతో 30కి 30 కౌన్సిలర్ స్థానాలనూ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోని టీడీపీ.. ప్రస్తుతం తునిలో అరాచకాలకు పాల్పడుతోంది. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినా ఎన్నిక ప్రశాంతంగా జరిపించలేక చేతులెత్తేయడం విచిత్రం. ఈ ఎన్నిక సందర్భంగా టీడీపీ అధికార దుర్వినియోగం తునిలో అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపించింది.
● గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
● జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్‌చార్జి తోట నరసింహం, యువ నాయకుడు తోట రాంజీ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను తుని రైల్వే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
● మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులను తుని రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
● రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త జక్కంపూడి గణేష్‌లను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని తీరుపై నిరసన తెలిపారు. రాజాను అరెస్టు చేశారనే సమాచారంతో మాజీ మంత్రి, చెల్లుబోయిన వేణు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్‌లు ఆయనఇంటికి వెళ్లగా పోలీసులు నిర్బంధించారు.
● రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును రావులపాలెం వద్ద, పి గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును అయినవిల్లిలోను హౌస్ అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment