
‘చలో తుని’కి వెళ్లనీయకుండా పోలీస్ ఆంక్షలు
వైఎస్సార్ సీపీ నేతలకు నోటీసులు
అమలాపురం టౌన్: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం ఇచ్చిన చలో తుని కార్యక్రమానికి అమలాపురం నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలువురి పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చలో తుని కార్యక్రమానికి అనుమతులు లేని దృష్ట్యా ఎవరూ ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక వేళ అనుమతులు లేని ఆ కార్యక్రమానికి అమలాపరం నియోజకవర్గం నుంచి ఎవరైనా వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని అమలాపురం పట్టణ, మూడు మండలాల పార్టీ అధ్యక్షులకు పోలీసులు నోటీసులు జారీ చేసి తుని వెళ్లకుండా కట్టడి చేశారు. అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి. ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆంక్షలు, నోటీసులు అమలయ్యాయి.
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు హౌస్ అరెస్ట్
రావులపాలెం: మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి గొల్లపల్లి సూర్యారావును మంగళవారం రావులపాలెంలో ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కాకి నాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన నేపద్ధ్యంలో అక్కడ వెళ్ళకుండా ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment