పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్‌లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు.
బాలికపై లైంగిక దాడి
కేసులో నిందితుడి అరెస్టు
ముమ్మిడివరం: బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని బుధవారం అరెస్టు చేసినట్టు ఎస్సై డి.జ్వాలాసాగర్ తెలిపారు. అనాతవరం గ్రామానికి చెందిన పరమట దుర్గాప్రసాద్(బులి చంటి) అక్కడి ప్రభుత్వ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను సోమవారం కిడ్నాప్ చేశాడు. ఆమెను అమలాపురం తీసుకెళ్లి, అక్కడ ఓ ఇంట్లో ఉంచి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులకు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ విషయం దుర్గాప్రసాద్‌కు తెలియడంతో, బాలికను రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్ర వంతెన వద్ద బస్సు ఎక్కించి పంపేశాడు. తన ఇంటికి చేరిన బాలికను పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పర్యవేక్షణలో ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్‌కుమార్, ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అనాతవరం సెంటర్‌లో అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టుకు తరలించగా, మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు.
కాకినాడ, సామర్లకోట
రైల్వే స్టేషన్లలో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment