క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్‌పై 7–1 స్కోర్‌తో ఛత్తీస్‌గఢ్ సెక్టార్, ఆర్‌బీఎస్ భువనేశ్వర్‌పై ఆర్‌బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్‌బీఎస్ ఛండీగఢ్‌పై ఆర్‌బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్‌పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్‌తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్‌పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్‌తో, కేరళ సెక్టార్‌పై ఛత్తీస్‌గఢ్ సెక్టార్ 13–0 స్కోర్‌తో, మధ్య ప్రదేశ్ సెక్టార్‌పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్‌తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్‌లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్‌ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment