మార్చి నెలాఖరుకు రీ సర్వే పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: భూముల రీ సర్వే ప్రక్రియను మార్చి నెలాఖరు నాటికి క్షేత్ర స్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ రెవెన్యూ, సర్వే ఉద్యోగులను ఆదేశించారు. రీ సర్వే పురోగతిపై బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులతో మాట్లాడుతూ, పాత–కొత్త సర్వే నంబర్ల వ్యత్యాసాలను సరిచేయాలని, మ్యాప్‌లను రూపొందించాలని ఆదేశించారు. పొరబాట్లకు తావు లేకుండా, పకడ్బందీగా మార్గనిర్దేశాలకు అనుగుణంగా నిర్వహించాలని చెప్పారు. బ్లాకుల ఆధారంగా ప్రభుత్వ భూములు గుర్తించాలన్నారు. ఫిర్యా దుల పరిష్కారంలో అలసత్వం వహించరాదన్నారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా, భూ యజమానుల సమక్షంలోనే సర్వేను నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి బ్లాక్‌లో 250 ఎకరాలకు మించకుండా సర్వే చేపట్టాలన్నారు. జేసీ టి.నిషాంతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కె.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment