ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ సంచులు
● సూపర్ మార్కెట్లు, రైతు బజార్లలో తప్పనిసరి
● వీటి తయారీకి డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహం
● కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు వంటి వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జూట్ సంచుల వినియోగాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులకు ఆదేశించారు. గురువారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర మూడో శనివారం కార్యక్రమ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ సంచుల విక్రయదారులను గుర్తించి, విక్రయాలను నిలుపుదల చేయాలని, వాటి స్థానంలో ప్రత్యేకంగా ఎస్‌హెచ్‌జీల ద్వారా జూట్ బ్యాగులు తయారు చేయించి, సూపర్ మార్కెట్లు, రైతు బజార్ల వద్ద విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా డ్వాక్రా సంఘాలకు ఉపాధి, పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగులబెట్టకుండా రీ సైక్లింగ్ చేస్తూ, తిరిగి విక్రయించేలా కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్, పంచాయతీ అధికార్లకు సూచించారు. దుకాణాలు, హోటళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వాటి స్థానే అరిటాకులు, విస్తరాకులు, పేపర్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పెంచాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల సమన్వయంతో దీనిని సమర్థంగా నిర్వహించాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కింద పట్టణాలు, గ్రామాల్లోని వివిధ పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడతారన్నారు డీఈవో షేక్ సలీంబాషా, డీఎంహెచ్‌ఓ దుర్గారావు దొర, డీసీహెచ్‌ఎస్ కార్తీక్, డీపీవో శాంతలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ శివశంకర్‌ప్రసాద్, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, మున్సిపల్ కమిషనర్లు, వీఐపీ నాయుడు, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల నిర్మాణంలో పీచు వినియోగంపై అధ్యయనం
డెల్టా ప్రాంతమైన కోనసీమ జిల్లాలో గోదావరి వరద కట్టలు, రోడ్లు, డ్రైన్లు, పంట కాలువల గట్ల పటిష్టతకు దీర్ఘకాలిక మన్నిక పెంచేందుకు కొబ్బరి పీచు, జియో టెక్స్‌టైల్స్ మ్యాట్ల వినియోగం సాధ్యాసాధ్యాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ విభాగాల ఇంజినీర్లకు క్వాయర్ పరిశ్రమల కేంద్రం ప్రతినిధి త్రిమూర్తులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్ల నిర్మాణంలో పటిష్టతకు శాసీ్త్రయపరంగా లేయర్ల నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు, ఇది విజయవంతమైతే జిల్లా అంతటా ఈ సాంకేతికతను జోడించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవీవీ కిషోర్, జల వనరుల శాఖ ఈఈ బి.శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఈఈ బి.రాము, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం పీకేపీ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment