కాకినాడలో నటి శ్రీలీల సందడి
జేసీ మాల్ ప్రారంభం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. ఆదివారం స్థానిక మెయిన్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మూడంతస్తులు తిరిగి వివిధ రకాల చీరలు, ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాకినాడకు రావడం చాలా సంతోషంగా ఉందని, గతంలో కూడా ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. షాపింగ్ మాల్‌లో రకరకాల ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.
సరసమైన ధరలు అందిస్తున్న షాపింగ్ మాల్‌లో దుస్తులు కొనుగోలు చేయాలని అన్నారు. మాల్ అధినేతలు ఎం.వెంకటరెడ్డి, జమున మాట్లాడుతూ జేసీ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంబో ఆఫర్లు ఇస్తున్నామన్నారు. తక్కువ ధరలో నాణ్యమైన వస్త్రాలు అమ్మడమే తమ సక్సెస్‌కు కారణమన్నారు. మహిళలు మెచ్చే ఎన్నో రకాల చీరలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. శ్రీలీలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment