● జిల్లావ్యాప్తంగా 51 కేంద్రాల్లో నిర్వహణ ● పరీక్షలు రాయనున్న 43,754 మంది విద్యార్థులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి (ఆర్‌ఐఓ) ఎన్‌ఎస్‌వీఎల్ నరసింహం గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలి. తమ పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి. పరీక్షల నిర్వహణకు 51 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 51 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 17 మంది అడిషనల్ డీఓలు, 10 మంది కస్టోడియన్లతో పాటు మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. సీతానగరం, మురమండ, రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనపర్తి జీబీఆర్, ఎన్‌ఎంఆర్ కళాశాలలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, అక్కడ మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసేంత వరకూ ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తెరవరాదని ఆదేశించారు. ఆయా విద్యార్థుల వాట్సాప్‌కు హాల్ టికెట్లు పంపించారు. వాటిని విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లవచ్చు.
పరీక్షలు రాయనున్న విద్యార్థులు
ఫస్టియర్ జనరల్ 20,591
ఒకేషనల్ 2,226
ద్వితీయ సంవత్సరం జనరల్ 19,062
ఒకేషనల్ 1,875
మొత్తం 43,754
Comments
Please login to add a commentAdd a comment