రెండో ర్యాంకుకు అన్నవరం దేవస్థానం !
ఇతర పుణ్యక్షేత్రాల స్థానం దిగజారడంతో ఎగబాకిన వైనం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవల్లో రెండో ర్యాంకును సాధించింది. గత నెలలో రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చివరగా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 మధ్య సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన దేవస్థానాల భక్తుల అసంతృప్తి శాతం తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ దేవస్థానం ఏడో ర్యాంకులో ఉండడంతో కలెక్టర్ షణ్మోహన్ గత నెల 24న అన్నవరం విచ్చేసి, విస్తృత తనిఖీలు నిర్వహించి, దేవస్థానం మొదటి ర్యాంకులో రావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి తాజా ర్యాంకులు ప్రకటించింది. భక్తులకు దర్శనంలో రెండో ర్యాంకు, మౌలిక వసతుల్లో మూడో ర్యాంకు, ప్రసాదం రుచిలో రెండో ర్యాంకు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment