పదవీ విరమణకు ఒక్క రోజు ముందు ఆగిన గుండె
రాజోలు: ఫైర్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న భైరిశెట్టి బాలకృష్ణ (62) ఈ నె 28న పదవీ విరమణ చేయనుండగా.. ఒక రోజు ముందు గుండెపోటుతో రావడంతో గురువారం మృతి చెందారు. రాజోలు గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఆయన ముమ్మిడివరం అగ్నిమాపక కేంద్రానికి విధులు నిర్వర్తించేందుకు మోటార్ సైకిల్‌పై బయలుదేరారు. ఇంటికి కూతవేటు దూరం వెళ్లేసరికి పంచాయతీ రోడ్డులో ఛాతి బరువెక్కి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్థానికులు ఆయనను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజోలులో లీడింగ్ ఫైర్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ మూడు నెలల క్రితం పదోన్నతిపై ముమ్మిడివరం ఫైర్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. పోస్టుమార్టమ్ అనంతరం బాలకృష్ణ మృతదేహాన్ని స్వగ్రామం మామిడికుదురు మండలం కంచివారిపాలానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment