ఇంతింతై... సేవకు అంకితమై.. | - | Sakshi
Sakshi News home page

ఇంతింతై... సేవకు అంకితమై..

Published Sat, Mar 8 2025 12:13 AM | Last Updated on Sat, Mar 8 2025 12:12 AM

ఇంతిం

ఇంతింతై... సేవకు అంకితమై..

అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న మహిళలు

అధికారులుగా తమదైన ముద్ర

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నిడదవోలు: భగవంతుడు అన్నిచోట్లా ఉండలేడని తనకు బదులుగా అమ్మను సృష్టించాడని అంటారు. ఇది మహిళా ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ముద్దులోలికే కూతురిగా, ఇంటి పనుల్లో సహయకురాలిగా, సమాజ స్థితిగతులను అవగాహన చేసుకునే విద్యార్థిగా, జీవిత భాగస్వామిగా, పిల్లలను సాకే సృష్టికర్తగా, కుటుంబాన్ని చక్కదిద్దే ప్రణాళిక రచయితగా, శ్రామిక మహిళగా, ఉద్యోగినిగా, అన్నింటికీ మించి అమ్మగా సాగే జీవితమే ఆమె. కడుపులోనే చిదిమేద్దమనో, మదమెక్కి హత్యాచారం చేద్దామనో, ఆస్తుపాస్తుల కోసం అంతం చేద్దామనో అనుకున్న వాళ్లకు ఆ అమ్మ గొప్పదనం తెలియకపోవచ్చును. మొత్తం మానవ సమాజానికి ఆ ఆడదే ఆధారం. మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ సామాజిక సేవలో రాణిస్తున్నారు. సామాజిక సమస్యలను సవాల్‌గా తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో కూడా రాణిస్తున్న నారిమణులు ఉన్నారు. మరో వైపు ఓ అమ్మగా పిల్లలను లాలిస్తూ..గృహిణిగా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళా అధికారులు తమదైన ముద్ర వేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...

మానసిక దివ్యాంగులకు సేవ చేస్తూ...

నిడదవోలు మండలంలోని శంఖారాపురం గ్రామ శివారున ఉన్న సహాయ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మానసిక దివ్యాంగుల కేంద్రంలో విశాలాక్షి తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అన్నెం పున్నెం ఎరగని అభాగ్యులకు దగ్గర ఉండి వారి పరిచర్యలు చేస్తూ సేవ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందిన విశాలాక్షి పీజీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్‌లోని బోజ్‌ యూనివర్శిటీలో బీఈడీ(ఎంఆర్‌) పూర్తి చేశారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్గనైజర్‌, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న విశాలాక్షి సేవలకు గుర్తిస్తూ 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారానికి తీసుకున్నారు.

సేవలోనే ఆత్మ సంతృప్తి

నిడదవోలు పట్టణానికి చెందిన డాక్టర్‌ కుంచాల విజయకి చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలి..నలుగురికి సేవా చేయ్యాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉంది. కోట రామకృష్ణారెడ్డి, జాలమ్మ దంపతుల కుమార్తె విజయ. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా ఎంతో పట్టుదలతో బీఎస్సీ చదివారు. ప్రస్తుతం జగన్నాథపురం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సేవాభావం గల భర్త ప్రొత్సహించడంతో ఆమె సేవా గుణాన్ని భర్త గ్రహించాడు. భర్త ప్రోత్సాహంతో మనోజ్ఞ చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్త ఆదాయంలో నెలకు 20 శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు సేవ కార్యాక్రమాలను చేపడుతున్నారు. నిడదవోలులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి దంపతులు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ట్రస్టు కార్యక్రమాలు ఇద్దరూ నిర్వహిస్తూ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న సేవలకు గుర్తింపుగా రెండు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఏపీ స్టేట్‌ కల్చరల్‌ ఆవేర్‌నెస్‌ సోసైటీ, ఏపీ బెస్ట్‌ సిటిజన్‌ అవార్డు, పొట్టి శ్రీరాములు విశిష్ట సేవా శిరోమణి పురస్కారంతో పాటు అమెరికాలో బర్కెలీ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. కరోనా సమయంలో చేసిన సేవలకు గుర్తిపుగా విశ్వగురు వరల్డ్‌ రికార్డు నుంచి రోనా వారియర్స్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

గొల్లపల్లి

భరణి

ఎల్లార్‌

ఆమె చేయి పడితే

కంటి చూపు ఖాయం

నిడదవోలు పట్టణంలో లయన్స్‌ కంటి ఆసుపత్రిలో గత ఎనిమిదేళ్లుగా కంటి వైద్యురాలిగా పనిచేస్తున్న గొల్లపల్లి భరణి ఎల్లార్‌ తన కంటూ ప్రత్యేక స్ధానం ఏర్పరచుకున్నారు. ఆమె చేయి వేస్తే కంటి చూపు వస్తుందనే నమ్మకం వృద్ధుల్లో కలిగింది. ఇప్పటి వరకు ఆమె 45,000 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంధ సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల్లో సైతం పాలు పంచుకుంటారు. రోగుల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. 1974లో కొవ్వూరులో జన్మించారు. 1999లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌, పీజీ పూర్తి చేశారు. వృత్తిపట్ల అంకిత భావం, పేదలకు ఉచిత వైద్య సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు.

అపజయం ఎరుగని కౌన్సిలర్‌

నిడదవోలు మున్సిపల్‌ పాలకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ పువ్వల రతీదేవి ఉన్నత విద్యావంతురాలిగా మహిళల సమస్యలపై గళమెత్తుతారు. ఎంఏ బీఈడి పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం నాలుగోసారి కౌన్సిలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2005లో కాంగ్రెస్‌ హయాంలో కౌన్సిలర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నాలుగో సారి కౌన్సిలర్‌గా విజయం సాధించి పదవిలో కొనసాగుతున్నారు. మధ్య తరగతి కుంటుంబం నుంచి వచ్చిన ఆమె ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్ట. ఎన్నికల బరిలో ఎవరు ఉన్నా ఓడించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచున్నారు. కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతూ మరోపక్క ప్రైవేట్‌ స్కూల్‌ నడుపుతూ పేద, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నారు.

మహిళలపై వివక్ష పోవాలి

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎందరో మహిళలు కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రధానంగా కుటుంబం అక్షరాస్యతతో ఉండాలి. మహిళలు సమాజ సేవ, రాజకీయ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తుంపును తెచ్చుకుంటున్నారు. అయినప్పటికి సమాజంలో మహిళలపై వివక్ష కొనసాగుతోంది. అది పూర్తిగా పోవాలి.

– డాక్టర్‌ ఈ తేజశ్రీ, వైద్యాధికారి,

నెహ్రూనగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, నిడదవోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
ఇంతింతై... సేవకు అంకితమై..1
1/4

ఇంతింతై... సేవకు అంకితమై..

ఇంతింతై... సేవకు అంకితమై..2
2/4

ఇంతింతై... సేవకు అంకితమై..

ఇంతింతై... సేవకు అంకితమై..3
3/4

ఇంతింతై... సేవకు అంకితమై..

ఇంతింతై... సేవకు అంకితమై..4
4/4

ఇంతింతై... సేవకు అంకితమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement