
బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షునిగా వీరబ్రహ్మం
● మహిళా అధ్యక్షురాలిగా హేమలత
అన్నవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షునిగా విద్యా శాఖలో పనిచేస్తున్న గుత్తుల వీరబ్రహ్మం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా దేవదాయ శాఖలో పనిచేస్తున్న హేమలత ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక రాఘవేంద్ర ఫంక్షన్ హాలులో రాష్ట్ర స్థాయి బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట కౌన్సిల్ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌పీఆర్ విఠల్‌కుకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా చొల్లంగి శ్రీధర్‌ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల నాయకులు, అన్నవరం దేవస్థాన బీసీ ఉద్యోగులు హాజరయ్యారు.
సత్యదేవుని దర్శించిన
ఇండియన్ నేవీ బృందం
అన్నవరం: ఇండియన్ నేవీలో ఉద్యోగ అవకాశాలు వివరిస్తూ కోల్‌కతా నుంచి కన్యాకుమారికి సుమారు 3,800 కిలోమీటర్లు 30 కార్లలో ర్యాలీ చేస్తున్న 30 మంది ఇండియన్ నేవీ ఉద్యోగుల బృందం ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించింది. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేశారు. యువకులు నేవీలో చేరి, దేశానికి సేవ చేయాలని, నేవీలో ఉద్యోగాలపై యువతకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేస్తున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. తొలుత ఈ బృందానికి దేవస్థాన పండితులు స్వాగతం పలికారు. సత్యదేవుని దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఏఈఓ కృష్ణారావు, ఆర్‌ఐ ప్రసాద్ ఉన్నారు.

బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షునిగా వీరబ్రహ్మం
Comments
Please login to add a commentAdd a comment