
దగాపై నిరసన సెగ
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
భారీ బైక్ ర్యాలీ
‘యువత పోరు’కు మద్దతుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యాన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాష్ నగర్‌లోని రాజా నివాసం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నందం గనిరాజు జంక్షన్, బైపాస్ రోడ్డు తాడితోట, స్టేడియం రోడ్డు, శ్యామలా టాకీస్ జంక్షన్, కోటిపల్లి బస్టాండ్, ఐదు బళ్ల మార్కెట్ మీదుగా బొమ్మూరులోని రాజమహేంద్రవరం రూరల్ పార్టీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకూ సాగింది. ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు, యువత వేలాదిగా పాల్గొన్నారు.

దగాపై నిరసన సెగ

దగాపై నిరసన సెగ
Comments
Please login to add a commentAdd a comment