ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం దారుణం. సూపర్ సిక్స్ హామీల్లో ఏ పథకానికి ఎన్ని నిధులు బడ్జెట్‌లో కేటాయించారు? మెగా డీఎస్సీపై తొలి సంతకం కూడా చేశారు. తీరా చూస్తే 16 వేల పోస్టులు ఏరకంగా భర్తీ చేస్తారో అర్థం కాని పరిస్థితి. అటువంటప్పుడు సంతకానికి విలువేముంది? ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, ఇచ్చిన హామీలన్నీ బేషరతుగా అమలు చేయాలి. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తాం.
– మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంపీ,
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
హామీలు తుంగలో తొక్కడం కూటమి నైజం
కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. పథకాలు ఇవ్వకుండా దగా చేసింది. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడం, ప్రజలను పక్కదారి పట్టించడం కూటమి ప్రభుత్వ నైజం. 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో కనీస కేటాయింపులు కూడా చేయలేదు. పేద పిల్లలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చేస్తోంది.
– డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ
రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి
ప్రైవేటీకరణ ఆపాలి
కూటమి ప్రభుత్వం చేపట్టాలనుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం ఆపాలి. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ప్రతి ఇంట్లో యువత ఉన్నత చదువులు చదువుకుని, జీవితంలో స్థిరపడేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేశారు. రూ.4.76 లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.
– తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు
కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. ఫలితంగా కొత్తగా ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో వచ్చిన కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యకు భయపడి వెనక్కి పోతున్నాయి. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి, ఐదు క్వార్టర్స్‌కు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో పెట్టడం దారుణం.
– జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment