టీడీపీ అబద్ధాల పుట్ట
విద్యార్థులు, యువతకు మద్దతుగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘యువత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఇలా అబద్ధాలతో ఆకలి కడుపులు నింపలేరని ప్రజలే గుర్తించారు. విద్య, వైద్యం అనే ప్రధాన అవసరాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మాజీ సీఎం జగన్‌పై కూటమి నాయకులు లేనిపోని అబద్ధాలు చెప్పారని, రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేశారని ప్రజలు గమనించారు. నిరుద్యోగ భృతి, ఫీజు బకాయిలు తక్షణం ఇవ్వాలి. రూ.4,600 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి. జగన్ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాబుకు
తెలియదా?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు హామీలు ఇచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? గత ప్రభుత్వం అప్పులు చేయడం వల్లనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోతున్నామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పడం చూస్తూంటే ఆయన అనుభవం ఎక్కడికి పోయిందో అర్థం కావడం లేదు. తప్పుడు వాగ్దానాలు చేసి తల్లిదండ్రులను, నిరుద్యోగులను, యువతను చంద్రబాబు మోసం చేశారు. మాజీ సీఎం జగన్‌పై అనవసర విమర్శలు మాని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టడం చంద్రబాబు, లోకేష్‌లకు మంచిది.
– తానేటి వనిత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి
టీడీపీ అబద్ధాల పుట్ట
Comments
Please login to add a commentAdd a comment