ప్లాస్టిక్ రహిత సమాజం అవశ్యం
రాజమహేంద్రవరం సిటీ: ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యాన స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ ర్యాలీ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై ప్రచార కార్యక్రమాలు, ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు మాటలకు పరిమితం కాకుండా ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. దీనికోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
Comments
Please login to add a commentAdd a comment