
ఎక్కడి గింజలు అక్కడే
దిగుబడి వచ్చినా కొనేవారు లేక కోకో గింజలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. కార్పొరేట్ సంస్థలు సిండికేట్‌గా ఏర్పడడంతో ఎప్పుడైనా వారికే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఎకరాకు 5 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 3 క్వింటాళ్లు వస్తోంది. రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. గత ఏడాది మార్చి నెలలో కిలో ధర రూ.1,050 ఉండగా, ప్రస్తుతం రూ.550 ఉంది. ఈ ధర నిలబడుతుందనే నమ్మకం లేదు. ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గింది. దీనివల్ల ఎకరాకు ప్రస్తుత ధర ప్రకారం రూ.1.2 లక్షల వరకూ ఆదాయం తగ్గుతుంది.
– యలమాటి భాస్కరరావు, కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం
Comments
Please login to add a commentAdd a comment