ఉమ్మడి జిల్లాలో.. | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో..

Published Mon, Mar 17 2025 12:12 AM | Last Updated on Mon, Mar 17 2025 12:12 AM

ఉమ్మడ

ఉమ్మడి జిల్లాలో..

సచివాలయాలు 620వలంటీర్లు 12,272
సచివాలయాలు 1,644వలంటీర్లు 30,887

కపిలేశ్వరపురం: సంక్షేమం, అభివృద్ధి కూటమి అజెండా, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి పేరుతెస్తా, పాతిక కేజీల బియ్యం కావాలా? పాతికేళ్ల భవిష్యత్‌ కావాలా.. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఏటా జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల.. వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు.. ఇవీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి నేతలు చెప్పిన మాటలు. ఆయా లక్ష్యాలను అప్పటికే సాధించే క్రమంలో కొనసాగుతున్న వైఎస్సార్‌ సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి పన్నిన కుట్రలో భాగంగా వెదజల్లిన హామీలవి. కారణాలేవైనా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కన పెట్టి అప్పటికే పేదలకు సేవలందిస్తున్న వలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టింది. రూ.10 వేల వేతనం మాట దేవుడెరుగు ఉన్న ఉపాధినే ఊడపెరికేశారు. వలంటీర్ల తొలగింపు కేవలం వారి కుటుంబాలకే కాదు యావత్‌ ఆంధ్ర ప్రజలకూ యాతనే. తెల్లవారుజామునే పింఛను అందజేత నుంచి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, దరఖాస్తు చేయించడం, మొత్తంగా లబ్ది వారి ఖాతాలకు జమ చేయించడమూ... ఇలాంటి సేవలన్నీ మూలన పడ్డాయి. దీంతో వలంటీర్లు సంఘం కట్టి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు.

సేవలు అమోఘం

ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 2,36,331 మంది, కాకినాడ జిల్లాలో 2,72,437, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 2,37,244 మంది కలిపి మొత్తం 7,46,012 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. వీరంతా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరైనవారే. వారందరికీ ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకే వలంటీర్లు పింఛన్లు అందజేసేవారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం అప్పగించిన సేవా కార్యక్రమాల్లో విధులు నిర్వహించారు. తుపాన్లు, వరదల సమయాల్లో కోనసీమ, తూర్పు గోదావరి నదీతీర లంక గ్రామాల్లోని బాధితులకు తాగునీరు, నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు పడవల్లో దరి చేర్చేవారు.

వలంటీర్ల తొలగింపు ప్రభావమిలా...

‘ఉమ్మడి’ జిల్లాలోని 1,644 వార్డు, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లుండేవారు. వారు లేకపోవడంతో 7,46,012 మందికి ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను అందజేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంచగలమన్నది ప్రకటనలకే పరిమితమైంది. అప్పుడు సైతం లబ్ధిదారులను పంచాయతీ కార్యాలయానికి లేదా కూడలికి రమ్మని సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. ఇక రెండో నెల నుంచి వలంటీర్ల మాదిరిగా పింఛను ఇచ్చిన తీరు కానరాలేదు. వలంటీర్లు లేక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. చేస్తున్న సర్వేల్లో సేవల్లో నాణ్యత కొరవడుతోందన్న వాదన ఉంది.

వలంటీర్లను విస్మరించిన కూటమి ప్రభుత్వం

రూ.5 వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతామన్న కూటమి హామీకి అధికారంలోకి వచ్చాక తూట్లు పొడిచింది. నెలకు రూ.10వేలు సంగతి ఎలా ఉన్నా ఒక్క రూపాయి కూడా మేలు చేసింది లేదు. ఐదేళ్లూ సేవలందించిన తమను విస్మరించవద్దంటూ ప్రభుత్వాన్ని వలంటీర్లు వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోవడంతో పోరాటబాట పట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కేవలం పాతిక కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కాదు పాతికేళ్ల భవిష్యత్‌ ఇస్తామన్న పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ సభలో తమకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించకపోవడంపై వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే చట్టపరమైన సమస్యలొస్తాయని మంత్రి లోకేశ్‌ అసెంబ్లీలో ప్రకటించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చేటప్పుడు ఈ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2025–26 వార్షిక బడ్జెట్‌లో వలంటీర్లకు సంబంధించి నిధులను కేటాయించకపోవడంపై సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు.

‘ఉమ్మడి’ జిల్లా వలంటీర్ల ఉద్యమాలిలా..

2024 నవంబర్‌ 9న రాష్ట్ర రాజధానిలో ‘వలంటీర్ల ఆవేదన సదస్సు’ను నిర్వహించారు. అదే ఏడాది నవంబర్‌ 3న అమలాపురంలో జిల్లా స్థాయి నిరసన సమావేశం నిర్వహించారు. 2024 డిసెంబర్‌ 10న కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో వలంటీర్ల ఆందోళనకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ ఏడాది జనవరి 17న విజయవాడలో నిర్వహించిన సచివాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా వలంటీర్లను కూటమి ప్రభుత్వం నిర్భంధించింది. 2025 ఫిబ్రవరి 5న అమలాపురం కలెక్టరేట్‌ ఎదుట వలంటీర్లు ధర్నా చేశారు. ఈ నెల 12న వైఎస్సార్‌ సీపీ యువత పోరులో వలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం విజయవాడ అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ వద్ద ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఉమ్మడి’ జిల్లాలోని వలంటీర్లు సమాయత్తమయ్యారు.

సచివాలయాలు

512

వలంటీర్లు 9,034

సచివాలయాలు

512

వలంటీర్లు 9, 581

వలంటీర్లు నష్టపోయారిలా..

ఫ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఒక్కో వలంటీర్‌కు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీని ప్రకారం కాకినాడ జిల్లాలో 12,272 మంది వలంటీర్లు ప్రతి నెలా రూ.6,13,60,000, కోనసీమ జిల్లాలో 9,581 మంది వలంటీర్లు రూ.4,79,05,000, తూర్పుగోదావరి జిల్లాలో 9,034 మంది వలంటీర్లు రూ.4,51,70,000 చొప్పున అందుకునేవారు. మూడు జిల్లాలు కలిపి రూ.15,44,35,000 మేర వలంటీర్లకు వేతనం అందేది. దీని ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడచిన 9 నెలల్లో వారు రూ.138,99,15,000 మేర నష్టపోయారు.

ఫ అదే చంద్రబాబు అండ్‌ కో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.10 వేల వేతనం లెక్కేసుకుంటే 9 నెలల్లో కాకినాడ జిల్లా వలంటీర్లు రూ.110,44,80,000, కోనసీమ జిల్లా వలంటీర్లు రూ.86,22,90,000, తూర్పు గోదావరి జిల్లా వలంటీర్లు రూ.81,30,60,000 కలిపి మొత్తం రూ.277,98,30,000 మేర వేతనాలు కోల్పోయారు.

వలంటీర్లకు కూటమి వంచన

రూ.10 వేల గౌరవ వేతనమంటూ హామీ

అధికారంలోకి వచ్చాక

అమలు దాటవేత

ఆవిర్భావ సభలో ప్రస్తావించని పవన్‌

పాతికేళ్ల భవిష్యత్‌ అంటే ఇదేనా

అంటున్న వలంటీర్లు

చట్టపరమైన సమస్యలొస్తాయంటున్న

మంత్రి లోకేశ్‌

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా

వలంటీర్ల ఉద్యమాలు

నేడు ‘చలో విజయవాడ’

హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే..

ఎన్నికల సమయంలో వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలకు గౌరవ వేతనం పెంచుతామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే అవుతుంది. ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రకృతి విపత్తుల సమయాల్లో వలంటీర్లు విశేష సేవలందించారు. వారి సేవలను గుర్తించైనా విధుల్లోకి తీసుకోవాలి.

– నూకల బలరాం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కోనసీమ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
ఉమ్మడి జిల్లాలో..1
1/2

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో..2
2/2

ఉమ్మడి జిల్లాలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement