
అమరజీవికి ఘన నివాళి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్ర రాష్ట్ర అవతరణకు జీవితాన్ని అర్పించిన పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకుందామని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సీతారామ్మూర్తి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్ష్య సాధనకు శ్రీరాములు వంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, కలెక్టరేట్, ఇతర కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment