వైఎస్సార్‌సీపీ ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణువర్
కైకలూరు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముదిరాజ్ (ముత్రాసి) సామాజికవర్గ అధ్యక్షుడిగా ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోటకు చెందిన కోమటి విష్ణువర్ధనరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి గురువారం ఆదేశాలు అందాయి. విష్ణువర్ధనరావు ఇప్పటివరకు పార్టీ ముదిరాజ్ సామాజిక జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. విష్ణువర్ధనరావు నియామకంపై ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment