ఉద్యోగ భద్రత కల్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె.సుమన్, సహాధ్యక్షుడు గంట సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరులోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో కంటే మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.నాగభూషణం, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పి.సుశీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment