చిరు వ్యాపారులపై ప్రతాపం
ఏలూరు (టూటౌన్): ఏలూరు కార్పొరేషన్ ఎదురుగా స్థానిక పాండురంగ థియేటర్ వరకు గత 40 ఏళ్లుగా కార్మికులు రవాణా ఆటోలు పెట్టుకుంట్నుఆరు. వీరంతా మార్కెట్‌లో తమ వాహనాల్లో వివిధ రకాల సరుకులను లోడ్ చేసుకుని వాహనాన్ని కాలువ గట్టు వద్ద ఆపుతారు. ఏలూరు పాత బస్టాండ్ వైపు నుంచి మార్కెట్‌లోకి వచ్చే దారిలో కృష్ణా కాలువపై ఇరువైపులా రెండు వంతెనలు ఉన్నాయి. వీటి మధ్య ఖాళీ ప్రదేశంలో ఎన్నో ఏళ్లుగా కొందరు చిరు వ్యాపారులు పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వీరందరినీ మూకుమ్మడిగా నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పోలీసులు సాయంతో మంగళవారం ఉదయం ఖాళీ చేయించారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే వీటిని తొలగించామని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా ఖాళీ చేయించడం పట్ల వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బాధితులంతా ఎమ్యేల్యే బడేటి చంటి వద్దకు ప్రదర్శనగా వెళ్లి తమ సమస్యను తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కార్మికులు, పూల దుకాణదారులు, ఇతర చిరు వ్యాపారాలు చేసుకునే వారికి నష్టం లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment