తాబేళ్ల రక్షణకు చర్యలు
తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. నరసాపురం మండలంలోని తాబేళ్ల గుడ్ల సేకరణ, పునరుత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. 8లో u
బలివే ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
బలివే(ముసునూరు): దైవ దర్శనానికి ఆటంకం కలుగకుండా అధికారులంతా సమన్వయంతో బలివే మహా శివరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. బలివే శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్‌కలెక్టర్ స్మరణ్‌రాజ్ అధ్యక్షతన మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న ఉత్సవాల్లో లక్షలాదిగా హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలుగకుండా సమన్వయంతో పనిచేయాలన్నారు. రూ. 100, రూ.25తో పాటు ఉచిత దర్శనానికి ప్రత్యేకమైన క్యూ లైన్ల ద్వారా, దర్శన మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాలకు, పిండ ప్రదానాలకు ప్రత్యేక ప్రదేశాల ఏర్పాటు, మహిళల దుస్తుల మార్పిడికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలన్నారు. నూజివీడు, ఏలూరు రహదారికి మరమ్మతులు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవ ప్రాంగణ పరిసరాల్లో మద్యం విక్రయాలు నిరోధించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు శిబిరాలు, రెండు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment