నిరుద్యోగ భృతి కల్పించాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెల నెల ఇస్తానన్న భృతిని వెంటనే చెల్లించాలి, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– తంగెళ్ల రాధాకృష్ణ. తూర్పుతాళ్ళు
జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో ఆర్భాటంగా ప్రకటించడమే కాక ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేటి వరకు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. నిరుద్యోగ భృతి సైతం మరిచిపోయారు.
– సాకా సుబ్రహ్మణ్యం దేవ, బీఎస్సీ బీఈడీ
హామీ నెరవేర్చలేకపోయారు
నేను ఎంఏ చేశాను. కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచిన ఇంతవరకు ఆ ఊసే లేదు. ఎన్నికల హామీల అమలులో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
– అంబేడ్కర్, వేల్పూరు
జాబ్ లేక వ్యవసాయం..
ఎంఏ సోషల్ చేసి జాబ్ లేక వ్యవసాయం చేస్తున్నాను. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే డీఎస్సీ ఇస్తామన్నారు, ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా ఏ ఒక్క దానికి ప్రభుత్వం కట్టుబడి లేదు.
– పడవల నాని, బాలేపల్లి, ఎంఏ సోషల్
●
నిరుద్యోగ భృతి కల్పించాలి
నిరుద్యోగ భృతి కల్పించాలి
నిరుద్యోగ భృతి కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment