కలెక్టరేట్‌లో ‘స్వచ్ఛ ఆంధ్ర’
ఏలూరు(మెట్రో): పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లోని పరసరాలను సిబ్బందితో కలిసి ఆమె శుభ్రం చేశారు. ప్రతి నెలా మూడో శనివారం జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, సూపరింటెండెంట్లు రవికుమార్ పాల్గొన్నారు.
వ్యవసాయాధికారి కార్యాలయంలో.. ఏలూరులోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. చీపురు పట్టి ఆయన సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment