
అంగన్‌వాడీలపై నిర్బంధ కాండ
ఏలూరు (టూటౌన్): సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు విజయవాడ బయలుదేరిన అంగన్‌వాడీలపై కూటమి ప్ర భుత్వం నిర్బంధం విధించింది. ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు, వాహనాల అడ్డగింత, నాయకులను కదలకుండా అడ్డగించడం వంటి చర్యలకు పూనుకుంది. ఇది తమ హక్కులను కాలరాయడమేనని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సోమవారం చలో విజయవాడ వెళుతున్న నేపథ్యంలో జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్ర జాసంఘాల నాయకులు, పార్టీలు ఖండించాయి. చలో విజయవాడ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు సోమవారం సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.
జిల్లావ్యాప్తంగా..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్బంధకాండ కొనసాగింది. కై కలూరు రైల్వే స్టేషన్, ఏలూరురైల్వే స్టేషన్, చేబ్రోలు పోలీస్‌స్టేషన్ల వద్ద అంగన్‌వాడీలను నిర్బంధించారు. అలాగే జీలుగుమిల్లి, కుక్కు నూరు, వేలేరుపాడు తదితర మండలాలకు చెందిన అంగన్‌వాడీలను అశ్వారావుపేట సరిహద్దులో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్‌గేట్ వద్ద పలు ప్రైవేట్ వాహనాల్లో తరలివెళుతున్న అంగన్‌వాడీలను పెద్ద సంఖ్యలో అడ్డగించి వాహనాల నుంచి కిందకు దించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగన్‌వాడీలు ఆందోళనలు చేపట్టారు.
నిర్బంధాలను అధిగమించి..
ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా జిల్లా నుంచి సుమారు 2 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడ తరలివెళ్లినట్టు సీఐటీయూ నాయకులు తెలిపారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరించడంపై అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఐటీయూ ఖండన
నిర్బంధ కాండను సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు శనివారం ఉదయం నుంచి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అంగన్‌వాడీ వర్కర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారని విమర్శించారు.
జిల్లాలో మిన్నంటిన నిరసనలు

అంగన్‌వాడీలపై నిర్బంధ కాండ

అంగన్‌వాడీలపై నిర్బంధ కాండ

అంగన్‌వాడీలపై నిర్బంధ కాండ
Comments
Please login to add a commentAdd a comment