
అబ్బురం.. దివ్యాంగురాలి నైపుణ్యం
ఏలూరు(మెట్రో): ప్రభుత్వ నైపుణ్య, వృత్తి శిక్షణ సంస్థ ద్వారా జాబ్‌మేళాలో ఉద్యోగావకాశాన్ని పొందిన బత్తుల అంజు అనే అంధ దివ్యాంగురాలు కృతజ్ఞతగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీసి సోమవారం బహూకరించారు. జిల్లాలో దివ్యాంగులపై కలెక్టర్ చూపించే అభిమానాన్ని పురస్కరించుకుని ఆమె జీవిత చరిత్రను పుస్తకీకరించి కలెక్టర్ వెట్రిసెల్వి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజు తాను గీసిన చిత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. అంజు నైపుణ్య, పట్టుదల చూసి కలెక్టర్ అభినందించారు. కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది అంజును ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment