మృత శిశువు జననం కేసులో వీడిన చిక్కుముడి
కై కలూరు: కై కలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) బాత్‌రూం కమోడ్‌లో ఈ నెల 7న మృత శిశువు జననంపై చిక్కుముడి వీడింది. ప్రసవం తర్వాత మైనర్ బాలిక పరారైన ఘటన సంచలనం కలిగించింది. ఈ కేసులో సీఐ పి.కృష్ణ ఆధ్వర్యంలో టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే రాచపట్నం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు చిన్నతనంలో తండ్రి మరణించాడు. తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆమె పదో తరగతి పరీక్షలు తప్పగా ఇటీవల కై కలూరు కార్నర్‌స్టోన్ ఓకేషనల్ కాలేజీలో 6 నెలలు నర్సింగ్ చదివింది. ఏలూరులో నానమ్మ వద్ద బాలిక నివాసముంటుంది. పెదవేగి మండలం కొప్పాకకు చెందిన కార్ డ్రైవర్ ప్రత్తిపాటి వినీత్ (25)తో బాలికకు పరిచ యం ఏర్పడింది. అతని బంధువులు కై కలూరు మండలం రామవరంలో ఉండటం, ఒకే సామాజికవర్గం కావడంతో బాలికకు మరింత దగ్గరయ్యాడు. వినీత్‌కు వివాహం కాగా భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. అదే విధంగా రాచపట్నంకు చెందిన కొనాల గణేష్ (35) బాలికకు స్వయాన మేనమామ . ఇతను కూడా మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. గణేష్‌కు వివాహం కాలేదు. వీరిద్దరూ అనేక పర్యాయాలు లైంగికదాడికి పాల్పడడంతో గర్భం దాల్చినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోపోవడంతో శిశువు మరణించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారకులైన ఇద్దరు నిందితులపై పోక్సో కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్సైలను ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ అభినందించారు.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment