నిట్‌లో క్రీడా సంబరాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తే మంచి భవిష్యత్‌తో పాటు శారీరకంగా, మానసికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయని ఏపీ నిట్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి అన్నారు. మంగళవారం నిట్‌లో 2024–25 క్రీడా సంబరాలను ఆయన ప్రారంభించారు. నిట్ విద్యార్థులు విద్యతో పాటు జాతీయస్థాయిలో కబడ్డీ, పవర్ లిఫ్టింగ్, క్రికెట్, చదరంగం, వాలీబాల్ వంటి పోటీల్లో ప్రతిభ కనరబరుస్తుండడం అభినందనీయమన్నారు. డీన్‌లు డాక్టర్ కె.హిమబిందు, వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్ శ్రీనివాసన్, ఆచార్యులు డాక్టర్ తపస్, సుదర్శన్‌దీప పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక
తణుకు అర్బన్: ఈనెల 14 నుంచి 16 తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు తణుకు మండలం మండపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సంగాడి సత్యనాగ గణేష్ ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.మోహన్‌బాబు తెలిపారు. ఈనెల 9వ తేదీన తణుకులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్–16 కబడ్డీ పోటీల్లో గణేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. క్రీడాకారుడు గణేష్‌తోపాటు, ఫిజికల్ డైరెక్టర్ సంకు సూర్యనారాయణను హెచ్‌ఎం మోహన్‌బాబుతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
మామపై అల్లుడు కత్తితో దాడి
కాళ్ల: భార్యను తనతో కాపురానికి పంపడం లేదని పిల్లనిచ్చిన మామయ్యపై చిన్న అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటనపై కాళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం వేంపాడు గ్రామానికి చెందిన యు.సత్యనారాయణ ఇంటికి అతని రెండో అల్లుడు అత్తిలి మండలం కె.ఎస్.గట్టు గ్రామానికి చెందిన కోనా కిషోర్ సోమవారం వచ్చాడు. తన భార్యని కాపురానికి పంపమని కిషోర్ తన మావయ్య సత్యనారాయణపై ఘర్షణకు దిగి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సత్యనారాయణను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో కిషోర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లైంగిక దాడి కేసులో అరెస్ట్
పెనుగొండ: లైంగిక దాడి కేసులో నిందితుడిని మంగళవారం పెనుగొండ సీఐ రాయుడు విజయ్‌కుమార్ అరెస్ట్ చేశారు. గుడిపాడుకు చెందిన ఎం.రాంబాబు సోమవారం తన ఇంటి ఎదురుగా ఉన్న ఇంటిలో ఎవరూ లేని సమయంలో దివ్యాంగురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో రాంబాబును అరెస్ట్ చేసినట్లు ఎస్సై కే గంగాధర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
యానాం మద్యం విక్రేత అరెస్ట్
తణుకు అర్బన్: ఇరగవరంలో యానాంకు చెందిన మద్యం విక్రయిస్తున్న పత్తివాడ కరుణాకర్‌ను మంగళవారం అరెస్ట్ చేసి అతని నుంచి 6 టిన్‌ల బీర్లు, ఒక మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తణుకు ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సీఐ సత్తి మణికంఠరెడ్డి తెలిపారు.
నిట్‌లో క్రీడా సంబరాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment