నాణ్యమైన పొగాకును పండించాలి
బుట్టాయగూడెం: రైతులు నాణ్యమైన పొగాకును పండించి అధిక దిగుబడులు సాధించాలని జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రం ఆక్షన్ సూపరింటెండెంట్ బి. శ్రీహరి సూచించారు. బుట్టాయగూడెంలో పొగాకు బోర్డు అధికారుల బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గద్దే శ్రీధర్ పొలంలో ప్రకృతి వ్యవసాయం, పొటాషియం, రిలీజింగ్ బ్యాక్టీరియా వాడకంపై క్షేత్ర దినోత్సవ సదస్సును నిర్వహించారు. పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి భూసారాన్ని పెంపొందించుకోవాలన్నారు. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకును పండించాలని కోరారు. కార్యక్రమంలో ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ ప్రశాంత్ జోషి, ఐటీసీ కంపెనీ మేనేజర్ ఆదర్శ, కంపెనీ పీఎస్‌ఎస్ నాగేంద్ర, పొగాకు రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డినాయుడు, గొట్టుముక్కల మల్లికార్జున రావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురికి గాయాలు
ఉంగుటూరు: ఎదురెదురుగా రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాలాయగూడెంకు చెందిన కోట శ్రీనివాసరావు చేబ్రోలు –గొల్లగూడెం వద్ద మలుపులో వెళుతుండగా తాడేపల్లిగూడెంకు చెందిన కె.అంజిబాబు, సంతోష్ మోటార్‌సైకిల్‌పై ఎదురుగా వచ్చి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment