సునీల్‌కుమార్‌ అక్రమ సస్పెన్షన్‌పై నిరసన | - | Sakshi
Sakshi News home page

సునీల్‌కుమార్‌ అక్రమ సస్పెన్షన్‌పై నిరసన

Published Tue, Mar 11 2025 12:37 AM | Last Updated on Tue, Mar 11 2025 12:37 AM

సునీల

సునీల్‌కుమార్‌ అక్రమ సస్పెన్షన్‌పై నిరసన

ఏలూరు (టూటౌన్‌) : డీజీ పీవీ సునీల్‌కుమార్‌ను అక్రమంగా సస్పెండ్‌ చేయడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులు స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళితులపై, దళిత అధికారులపై కక్ష పూరిత చర్యలు తీసుకోవడం మంచిది కాదన్నారు. తక్షణమే ప్రభు త్వం సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌ను రద్దు చేసి ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దళిత అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. న్యాయవాదులు టి.అజిత్‌ రాజు, జీటీ స్వామి, చదలవాడ రమణ, జి.విజయభాస్కర్‌, నున్న నాగేశ్వరరావు, ఎం. రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

స్విమ్మింగ్‌లో పతకం

ఏలూరు(మెట్రో) : 35వ సౌత్‌జోన్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ విశ్వనాథ్‌ భర్తియా స్విమ్మింగ్‌ పూల్‌కి చెందిన బలగ స్వామినాయుడు కాంస్య పతకం సాధించాడు. 50 మీటర్ల బటర్‌ ఫ్లై విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలవగా ఆమె అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరింత రాణించాలని ఆమె ఆకాంక్షించారు. స్విమ్మింగ్‌ దుస్తులు, సామగ్రిని స్వామినాయుడుకు అందించారు. శిక్షకుడు గణేష్‌ ఉన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు 12,485 మంది హాజరు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలోని 55 కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలకు 12,826 మందికి 12,485 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 11,022 మంది జనరల్‌ విద్యార్థులకు 10,809 మంది, 1,804 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1,676 మంది హాజరయ్యారని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు.

ఓపెన్‌ పరీక్షలకు..

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ఇంటర్‌ పరీక్షలకు సోమవారం 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. భౌతిక శాస్త్రం పరీక్షకు 317 మందికి 268 మంది , రాజనీతి శాస్త్రం పరీక్షకు 470 మందికి 354 మంది హాజరయ్యారు.

టెన్త్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయా ణ సౌకర్యం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ ప్రకటనలో తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చేనెల 1 వరకు విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపించి ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో అనుమతిస్తారన్నారు.

గోదావరి జిల్లాల్లో ఉప్పునీటి సమస్య

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రాన్ని పలు ప్రశ్నలు అడగ్గా.. కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు సముద్ర తీర ప్రాంతంలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా లు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి రాజ్‌ భూషణ్‌చౌదరి తెలిపారు. గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరప్రాంతాల్లో ఉప్పు చేరడం వలన అక్కడ పర్యావరణం దెబ్బతింతోందని, ఏయే ప్రాంతాలు ఉప్పు సమస్యను ఎదుర్కొంటున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమళ్‌ నత్వాని ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమా ధానమిచ్చారు. 2012–23 వరకు జాతీయ జ లాశయ మ్యాపింగ్‌ అధ్యయనాల్లో ఏపీలో భూ గర్భ జలాలపై అధ్యయనం చేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సునీల్‌కుమార్‌ అక్రమ సస్పెన్షన్‌పై నిరసన 1
1/1

సునీల్‌కుమార్‌ అక్రమ సస్పెన్షన్‌పై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement