ఉపాధి లేదు.. ఫీజు రాదు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి లేదు.. ఫీజు రాదు

Published Tue, Mar 11 2025 12:37 AM | Last Updated on Tue, Mar 11 2025 12:37 AM

ఉపాధి

ఉపాధి లేదు.. ఫీజు రాదు

రంగుల పనికి వెళ్లి ఫీజు చెల్లించా..

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయలేదు. దీంతో కాలేజీ వాళ్లు డబ్బులు అడుగుతుంటే సెలవుల్లో రంగుల పనికి వెళ్లి వచ్చిన డబ్బులను ఫీజులు చెల్లించా. డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరానికి చెందిన ఫీజులను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు.

– కటికల వరుణ్‌కుమార్‌, బీకాం కంప్యూటర్స్‌, పోలసానపల్లి, నూజివీడు మండలం

ఫీజుల కోసం అప్పులు

నూజివీడులో బీఎస్సీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డ బ్బులు రావాల్సి ఉంది. కాలేజీలో రోజూ ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేస్తుంటే మా తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజు కట్టారు. కూలి పనులు చేసుకుని జీవించే మాలాంటి వాళ్లం చదువుకోవాలంటే కష్టంగా ఉంది.

– పులపా గౌరి, బీఎస్సీ, సీతారాంపురం, నూజివీడు మండలం.

కూలి పనులకు వెళ్లి..

బీకాం సెకండియర్‌ చదువుతున్నా. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో తల్లిదండ్రులతో కూలి పనులకు వెళ్లి కొంత, అప్పు చేసి మరికొంత తెచ్చి ఫీజు చెల్లించాను. నాలుగో సెమిస్టర్‌ వస్తుండటంతో కాలేజీలో మళ్లీ ఫీజులు అడుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి.

– ఓలిపల్లి హరీష్‌, మర్రిబంధం, నూజివీడు మండలం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, వేల సంఖ్యలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల్లో తొలి పథకం నిరుద్యోగ భృతికి ప్రభుత్వం మంగళం పాడింది. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేలు ఇస్తామని యువతను నిండా ముంచింది. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 5,47,790 నివాస గృహాలు ఉన్నాయి. వీటిలో గ్రామాల్లో 4,50,118, పట్టణాల్లో 97,672 ఇళ్లు ఉన్నాయి. ఈ లెక్కన నెలకు రూ.164 కోట్లు నిరుద్యోగ భృతి కింద యువతకు చెల్లించాల్సి ఉంది. మరోవైపు పరిశ్రమలు, క్లస్టర్లు ఏర్పాటుచేసి ఉద్యోగాలిప్పిస్తామని హామీలు గుప్పించారు. ఇప్పటివరకూ జిల్లాలో ఒక్క క్లస్టర్‌ ఏర్పాటుచేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న అధికారిక ప్రకటన కూడా లేదు.

వందల కోట్లల్లో ఫీజు బకాయిలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలం గడుపుతోంది. గతేడాది మే నెలలో విడుదల చేస్తాం, ఆగస్టులో విడుదల చేస్తాం అన్నారు తప్ప ఆచరణలో అమలు కాలేదు. దీంతో ఏడాది కాలంగా అప్పులు చేసి తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 70 వేల మంది విద్యార్థులకు ఈ ఏడాది రూ.200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రావాల్సి ఉంది. 2024–25 విద్యా సంవత్సరానికి ‘ఫీజు’ బకాయిలకు మంగళం పాడినట్టే అని పలువురు అంటున్నారు.

జగన్‌ సర్కారులో..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో క్రమం తప్పకుండా అందించారు. ఏలూరు జిల్లాలో నాలుగేళ్లు కలిపి సుమారు రూ. 400 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.370 కోట్ల మేర తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏటా మూడు విడతలుగా నగదును జమ చేసేవారు. 2024లో మొదటి విడత కూడా జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు జమ చేసింది. తర్వాత బకాయిలను కొత్త సర్కారు వదిలేసింది.

చంద్రబాబు మాయమాటలకు యువత దగా పడింది.. ఆక్వా, ఫుడ్‌, అగ్రికల్చర్‌ క్లస్టర్లు ఏర్పాటు చేసి స్థానికంగా వేలాది ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు.. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఊదరగొట్టారు.. ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేస్తామన్నారు.. ఇలా ఎడాపెడా హామీలిచ్చారు.. తీరా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 9 నెలలు గడుస్తున్నా వీటి ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ వంచనను ఎండగడుతూ నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి కోసం, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు ఈనెల 12న ‘యువత పోరు’ పేరుతో ఆందోళన చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.

నిరుద్యోగ

భృతి

ఎప్పుడు

కూటమి దగా

అటకెక్కిన నిరుద్యోగ భృతి

స్థానికంగా ఉపాధి అవకాశాలు లేవు

లక్షల్లో ఉద్యోగాలంటూ ఎన్నికల్లో ప్రచారం

ఉన్న ఉద్యోగాలనూ పీకేసిన కూటమి ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థుల ఎదురుచూపులు

రేపు వైఎస్సార్‌సీపీ యువత పోరు

ఉద్యోగాల

మాటేంటి?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు చేకూర్చిన లబ్ధి

సంవత్సరం జగనన్న విద్యాదీవెన జగనన్న వసతి దీవెన

విద్యార్థులు లబ్ధి (రూ.కోట్లలో) విద్యార్థులు లబ్ధి (రూ.కోట్లలో)

2019–20 36,527 95.78 36,580 36.86

2020–21 37,148 77.97 37,750 35.76

2021–22 38,677 105.67 36,350 34.76

2022–23 33,655 81.53 32,316 30.96

2023–24 29,111 22.45 – –

No comments yet. Be the first to comment!
Add a comment
ఉపాధి లేదు.. ఫీజు రాదు 1
1/3

ఉపాధి లేదు.. ఫీజు రాదు

ఉపాధి లేదు.. ఫీజు రాదు 2
2/3

ఉపాధి లేదు.. ఫీజు రాదు

ఉపాధి లేదు.. ఫీజు రాదు 3
3/3

ఉపాధి లేదు.. ఫీజు రాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement