నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్యం అడుగడుగునా అధ్వానంగా తయారైంది. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే కాకుండా, ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్‌గా ఉండగా పారిశుద్ధ్యం ఇలాగేనా ఉండేదని పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 150 మంది ఉన్నా పారిశుద్ధ్యం దిగజారుతోంది. రోజుకు 30 టన్నుల చెత్త నూజివీడులో ఉత్పత్తి అవుతుండగా, ఆదివారం వస్తే కేవలం కొన్ని ప్రధాన రహదారుల్లోని చెత్తను మాత్రమే తొలగిస్తూ మిగిలిన పట్టణమంతా వదిలేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర అంటూ ప్రచారార్భాటం తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధను మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో చూపించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
– నూజివీడు
మంత్రి ఇలాకా.. పారిశుద్ధ్యం ఇలాగా..?
మంత్రి ఇలాకా.. పారిశుద్ధ్యం ఇలాగా..?