దెందులూరు: బైక్‌పై వెళ్తూ కిందపడి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని దెందులూరు ఎస్సైఆర్ శివాజీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం దెందులూరు గ్రామానికి చెందిన కొల్లా బత్తుల యేసు, గుంపుల వంశీ ద్విచక్ర వాహనంపై శ్రీరామవరం వెళుతున్నారు. గుంపుల వంశీ ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడుపుతూ కింద పడటంతో కొంత దూరం వెళ్లి ఎదురుగా దెందులూరు వైపు వస్తున్న ఆటోను ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న యేసు మృతి చెందగా గుంపుల వంశీ గాయపడ్డాడు. అతన్ని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
నూజివీడు: మండలంలోని ఓగిరాల తండాలో ఎకై ్సజ్ సిబ్బంది శుక్రవారం నిర్వహించిన దాడుల్లో వెయ్యి లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడంతో పాటు 35 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఏఈఎస్ జీ.పాండురంగారావు తెలిపారు. సంఘటన ప్రాంతం నుంచి పారిపోయిన కృష్ణపై కేసు నమోదు చేశామన్నారు. దాడుల్లో ఈఎస్‌టీఎఫ్ ఎస్‌ఐ కేఎండీ ఆరిఫ్, సిబ్బంది పాల్గొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ఎవరైనా ఎకై ్సజ్ నేరాలకు పాల్పడుతుంటే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
ప్రమాదంలో వ్యక్తి మృతి