
33వ గురు పట్టాభిషేక మహోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక గ్జేవియర్ నగర్ లోని సెయింట్ జేవియర్ బోర్డింగ్ దేవాలయంలో ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర 33వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. నగరంలోని అమలోద్భవి కథీడ్రల్ విచారణ గురువు ఫాదర్ ఐ.మైఖేల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బిషప్ జయరావు సందేశమిస్తూ ప్రతి గురువు ప్రజల కోసం జీవించాలని, క్రీస్తు ప్రభువు మా దిరి పేదలపై ప్రత్యేక ప్రేమ కలిగి ఉండాలని, భక్తులను నీతివంతమైన మార్గంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఫాదర్ మైఖేల్ మాట్లాడుతూ బిషప్ జయరావు ఆదర్శ గురువుగా ప్ర జలకు ఎనలేని సేవలను అందించారని, ప్రజ ల సమగ్ర అభ్యున్నతికి అహర్నిశలూ సేవలందించారన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్ ఆత్మశాంతి కోసం ఆచార్య డి.అబ్రహం, టోకూరి స్వరూపరాణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఫాదర్లు, గురువులు బిషప్ జయరావును ఘనంగా సన్మానించారు. ఫాదర్లు బి.రాజు, టి.ఇమ్మానియేలు, జె.బెనర్జీ, కార్పొరేటర్ ఎం. నిర్మల సిస్టర్స్, విశ్వాసులు పాల్గొన్నారు.
జూమ్ మీటింగ్‌లో ధూమపానం
శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసు
ఏలూరు (టూటౌన్): నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రయ్య నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ధూమపానం చేస్తూ పాల్గొన్న శా నిటరీ ఇన్‌స్పెక్టర్‌కు అధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు శనివారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ చంద్రయ్య జూమ్ మీటింగ్ నిర్వహించారు. కండ్రిగగూడెం 16వ సర్కిల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సోమేశ్వరరావు సిగరెట్ కాలుస్తూ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇది చర్చనీయాంశం కావడంతో నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఇన్‌స్పెక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏసీ చంద్రయ్యను ఆదేశించారు. ఈ మేరకు ఏసీ చంద్రయ్య షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ సంఘటనపై నగర వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉన్నతాధికారి ఎదుటే కింది స్థాయి ఉద్యోగి ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు వేలెత్తి చూపించే పనులు చేయడం సిగ్గు చేటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్‌లో సోమ వారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవని, దీంతో పీజీఆర్‌ను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.
ఘనంగా వసంతోత్సవాలు
ద్వారకాతిరుమల : చినవెంకన్న దేవస్థానానికి ఉపాలయం, క్షేత్ర దేవత కుంకుళ్లమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు వైభవంగా ప్రా రంభమయ్యాయి. 5 లక్షల గాజులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజ లు, కుంకుమార్చనలు జరిగాయి.
సంస్కృతికి చిహ్నం ఉగాది
భీమవరం: తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక అని, సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు చిహ్నాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం భీమేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

33వ గురు పట్టాభిషేక మహోత్సవం

33వ గురు పట్టాభిషేక మహోత్సవం