
గిరిజన పండుగలను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన సంప్రదాయ పండుగలైన బాట పండుగ, మామిడికాయ, చిక్కుడు, పప్పుల పండుగలను ప్రభుత్వం గుర్తించి ఐటీడీఏ ద్వారా ఘనంగా జరిపించే విధంగా ఏర్పాటు చేయాలి. మా పూర్వీకుల నుంచి వస్తున్న పండుగలను నేటికీ మేము ఆచరిస్తున్నాం.
– కొక్కెర భీమరాజు, అలివేరు, బుట్టాయగూడెం మండలం
పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం
మా పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తున్న మామిడికాయ పండుగను సంప్రదాయంగా నిర్వహిస్తూ వస్తున్నాం. మామిడి చెట్టుకు పూజలు చేసిన తర్వాతే ఆ ఫలాలను తింటాం. అప్పటి వరకూ ఎవ్వరూ ముట్టుకోం. ఎవరు ముట్టుకున్నా వారికి జరిమానా విధించడం జరుగుతుంది. – సర్ల బుల్లెమ్మ, అలివేరు, బుట్టాయగూడెం మండలం

గిరిజన పండుగలను ప్రభుత్వం గుర్తించాలి