
కాబోయే భర్తకు స్పెషల్ విషెస్ చెప్పిన అదితి
ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ్- అదితి
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్‌డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్‌మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్‌డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది.
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్‌గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment