అనంత్ రాధికల వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. అయితే ఆ వేడుకులో అంబానీ కుటుంబ సభ్యలు ధరించిన నగలు, డిజైనర్ వేర్‌లు గురించి నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇంతవరకు నీతా, ఇషా, రాధికల డిజైనర్ వేర్‌లు, నగలు గురించి విన్నాం. కానీ అనంత్ ధరించిన డ్రస్ కూడా అత్యంత ఖరీదైనదే గాక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
భారతీయ హస్తకళను అంబానీలు గౌరవిస్తారు అనేలా వారి ధరించే ప్రతి డిజైనర్‌వేర్‌లో కచ్చితంగా ఎంబ్రాయిడరీ ఉంటుంది. అదీ కూడా భారత పురాత సంప్రదాయ ఎంబ్రాయిడరీ మెళుకువలే ఎక్కుగా ఉండటం విశేషం. అనంత్ తన వివాహ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్ బూండీ జాకెట్‌ని ధరించాడు. దీనిపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ ఉంటుంది. దీన్ని నిమైన బంగారంతో అలంకరించారు.
రాజస్థాన్‌లోని నాథద్వారా ఆలయానికి సంబంధించిన పిచ్వాయ్ పేయింటింగ్ ఆధారంగా రూపొందించారు. ఇది కృష్ణుడి జీవితంలోని ఇతివృత్తాలను వర్ణిస్తుంది. ఇందులో తామరలు, చెట్లు, ఆవులు, నెమళ్లు తదితరాలు ఉంటాయి. ముగ్గురు భిల్వారా కళాకారులచే 600 గంటలకు పైగా కష్టపడి రూపొందించారు. దీనిపై సుమారు 100 రియల్ బంగారు ఆకులను వినియోగించారు.
ఇంతకీ పిచ్వై ఆర్ట్‌వర్క్ అంటే..
పిచ్వాయ్ పెయింటింగ్ అనేది రాజస్థాన్‌లోని నాథద్వారా నుంచి ఉద్భవించిన సాంప్రదాయ భారతీయ కళారూపం. ఇది ప్రధానంగా శ్రీకృష్ణుని ఆరాధనతో ముడిపడి ఉంది. ముఖ్యంగా శ్రీనాథ్‌జీగా అతని అభివ్యక్తిలో. ఈ క్లిష్టమైన పెయింటింగ్‌లు సాధారణంగా వస్త్రంపై వేస్తారు. వాటిని ఆలయ హాంగింగ్‌లుగా ఉపయోగిస్తారు అని ప్రొఫెసర్ ఫులారి పంచుకున్నారు.
పిచ్వాయ్ పెయింటింగ్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినది. ఈ సంప్రదాయం నాథద్వారాలో ప్రారంభమయ్యింది. ఇది హిందూమతంలోని పుష్టిమార్గ్ శాఖ అనుచరులకు ప్రముఖ పుణ్యక్షేత్రం. భక్తుల కోసం కృష్ణుడి కథలను దృశ్యమానంగా వివరించే లక్ష్యంతో, కృష్ణుడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చిత్రీకరించేలా ఆలయ కళాకారులు చిత్రలేఖనాలు సృష్టించారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం పరిణామం చెందింది. కళాకారులు తమ నైపుణ్యాలను తమ తరాలకు అందించి ఈ కళను నిలిచిపోయేలా చేశారు.
ఈ ఆర్ట్‌లో ఉండే ప్రత్యేకత క్లిష్టమైన వివరాలు, శక్తిమంతమైన రంగులు. ముఖ్యంగా కళారూపంలో కృష్ణుడితో కూడిన విస్తృతమైన దృశ్యాలను రూపొందించే అద్భుతమైన కుంచె పని ఉంటుంది. దీనిలో తరచుగా గోపికలు, ఆవులు, తామరలు, అతని దివ్య నాటకం (లీలలు) తదితర చిహ్నాలు ఉంటాయి. అందుకోసం ఖనిజాలు, కూరగాయల నుంచి తయారు చేసిన సహజ రంగులను ఉపయోగించడంతో ఆ ఆర్ట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంటుందని ప్రొఫెసర్ ఫులారి వివరించారు. అయితే ఈ పెయింటింగ్ మరింత హైలెట్ అయ్యేలా ఒక్కోసారి 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తుంటారని కూడా చెప్పారు. ఈ కళ దృశ్యమాన ఆనందాన్నే కాకుండా ఆధ్యాత్మిక అనుభవాన్ని కూడా అందిస్తుంది.
(చదవండి: ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!)
Comments
Please login to add a commentAdd a comment