ఎంతటి టెక్నాలజీ అయినా, ఎలాంటి సౌకర్యమైనా.. అందరికీ సులభంగా, సౌలభ్యంగా ఉండే మెషిన్స్‌కి ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంటుంది. అలాంటి సత్తా ఉన్న మేకరే ఈ రోబో మెషిన్(ఆటోమెటిక్ డ్రమ్ కుకింగ్ మెషిన్). ఇది 360 డిగ్రీస్ గిర్రున తిరుగుతూ ఎలాంటి వంటకాన్నైనా నిమిషాల్లో చేసేస్తుంది. ఈ నాన్ స్టిక్ పాట్ రోబో కమర్షియల్ ఫ్రైయింగ్ కుకర్.. అడుగు భాగంలో రెండు కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. చిత్రాన్ని గమనించినట్లైతే.. ఇరువైపులా స్టాండ్‌కి పైభాగంలో అటాచ్ అయ్యి ఉంటుంది. నాన్ వెజ్, వెజ్ అని తేడా లేకుండా అన్నింటినీ చాలా టేస్టీగా వండేస్తుంది ఈ గాడ్జెట్.
85 డిగ్రీల నుంచి 230 డిగ్రీల వరకూ 7 లెవల్స్‌లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. ఈ ఇంటెలిజెంట్ రోలింగ్ మెషిన్ ప్రత్యేకమైన పాత్ర(నాన్ స్టిక్ డ్రమ్) కలిగి ఉంటుంది. దాన్ని మేకర్ నుంచి సులభంగా వేరు చేసుకుని.. క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన మూత ఉంటుంది. దాంతో 360 డిగ్రీస్ తిరిగినా దీనిలోని ఆహారం సురక్షితంగా ఉంటుంది. మూతకు పైభాగంలో యాంటీ-స్కాల్డింగ్ హ్యాండిల్ ఉంటుంది. దాని పక్కనే ఎయిర్ వాల్వ్ ఉండటం వల్ల ఇందులో వంట వేగంగా కుక్ అవుతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment