ప్రతిభ ఉన్న చోటికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి నిదర్శనం స్టయిలిస్ట్ రిద్ధి మెహతా! తన మ్యాజిక్ స్టయిలింగ్‌తో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరిట్‌గా మారిన ఆమె గురించి కొన్ని వివరాలు..
ముంబైలో పుట్టిపెరిగిన రిద్ధికి చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఉండేది. ఆ మక్కువనే కెరీర్‌గా మలుచుకోవాలని కాలేజ్ డేస్‌లో నిర్ణయించుకుంది. డిగ్రీ తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి, లండన్‌కి వెళ్లి ఫ్యాషన్ కోర్సు చేసింది. ముంబైకి తిరిగొచ్చి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమీ పటేల్ దగ్గర ఇంటర్న్‌గా చేరింది. ఫ్యాషన్ ప్రపంచంలో అమీకి మంచి పేరు ఉంది. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ అమీ ఫేవరిట్! అందుకే ఆమె దగ్గర ఇంటర్న్‌గా వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంది రిద్ధి. పనిలో మెలకువలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ స్టయిలింగ్ తీరుతెన్నులనూ బాగా గమనించింది.
తనలోని సృజనకు ఆ పరిశీలనను జోడించి ప్రతిభను ప్రదర్శించి, సెలబ్రిటీల దృష్టిలో పడింది. అప్పుడే నటి ప్రియంకా చోప్రా పెళ్లిలో, రిద్ధికి అసిస్టెంట్ స్టయిలిస్ట్‌గా చాన్స్ దొరికింది. పలువురు బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలకు సింప్లీ సూపర్బ్ దుస్తులు, వెరీ లైట్ ఆభరణాలతో గ్రాండ్ లుక్‌ని తెచ్చి..పెళ్లంటే భారీ దుస్తులు, బరువైన నగలే అనుకున్న వారి అభిప్రాయాన్ని మార్చేసింది. తన స్టయిలింగ్‌తో మ్యాజిక్ చేసింది. అభినందనలు అందుకుంది. తర్వాత చాలామంది సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా ఎంచుకున్నారు.
అలా అమీ దగ్గర పనిచేస్తూనే రిద్ధి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకుంది. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా చాన్సెస్ పొందింది. బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలపరచుకుంది. కంఫర్ట్‌తో పాటు గ్రాండ్ లుక్ నిచ్చే రిద్ధి డిజైన్స్, స్టయిలింగ్‌ను మెచ్చి ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్ ప్రీత్ సింగ్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్స్ ఆమెను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఇంకెందరో వర్ధమాన నటీనటులను స్టయిలిష్ స్టార్స్‌గా తీర్చిదిద్దుతోంది రిద్ధి.
Comments
Please login to add a commentAdd a comment