ప్రతీకాత్మక చిత్రం
పిల్లల పుస్తకాలు సర్దుతుండగా ఫోన్ మోగితే తీసింది మంగ. అవతలి నుంచి ‘మేడమ్ మీ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు కేవైసీ అప్‌డేట్ చేయాల్సి ఉంది. బ్యాంకు నుంచి మీకో మెసేజ్ వస్తుంది. అందులోని కోడ్ చెప్పాల్సి ఉంటుంది చెప్పండి’ అనడంతో అలాగే అంది మంగ.
వచ్చిన మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చిందే కాబట్టి ఫర్వాలేదులే అన్న భరోసాతో ఆ కోడ్ నంబర్ చెప్పేసింది. అవతలి నుంచి ‘సరే, మేడమ్.. థాంక్యూ’ అంటూ ఫోన్ కట్ చేశారు.
మంగ ఫోన్ పక్కన పెట్టేసే టైమ్‌లో వచ్చిన మెసేజ్ అలర్ట్ చూసి ఏంటా అని ఆ మెసేజ్ ఓపెన్ చేసి, చూసింది. బ్యాంకునుంచి మెసేజ్.. తన ఖాతానుంచి ఎవరో అకౌంట్‌కు రూ.2 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా ఉండటంతో షాక్ అయ్యింది.
∙∙
సుందర్ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్ రావడంతో విసుగ్గా ఆన్సర్ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్ కార్డ్ బోనస్ పాయింట్స్ రిడీమ్ చేసుకోమంటూ కస్టమర్ కేర్ కాల్. కట్ చేద్దామంటే పాయింట్స్ గురించి చెబుతున్నారు.
కొంతైనా బెనిఫిట్ ఉంటుంది కదా అని కాలర్ అడిగిన సమాధానం చెబుతూ వచ్చాడు. పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి ధృవీకరణ ప్రశ్నలు అడగడంతో చెప్పాడు. ‘మీ నంబర్‌కు వచ్చిన మెసేజ్ లింక్ ఓపెన్ చేసి, వివరాలు ఇస్తే, ఐదు నిమిషాల్లో మీకు రిడీమ్ పాయింట్స్ మనీబ్యాక్ వస్తుంది సర్’ అనడంతో అదే పని చేశాడు సుందర్.
ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి, తినడం పూర్తయ్యాక ఆఫీసుకు బయల్దేరుతూ ఫోన్ చూసుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ ఉండటంతో సుందర్ కి ఏమీ అర్థం కాలేదు.
∙∙
ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలలో OTP/UPI మోసం ఒకటి. మధ్యవయస్కులు, వృద్ధులే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. మోసగాళ్లు బాధితుల నుంచి ఓటీపిని అడుగుతారు. లేదా స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా బాధితుడి ఫోన్‌పై వారికి తెలియకుండానే పూర్తి నియంత్రణను సాధిస్తారు. ఫోన్‌పై పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత, మోసగాడు పాస్‌వర్డ్‌లను పట్టుకుని బాధితుడి ఖాతాతో లావాదేవీలు చేయడం ప్రారంభిస్తాడు.
ఇటీవలి కాలంలో నగదు చెల్లింపులను సులభతరం చేసే డిజిటల్ లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) వేగవంతమైన ప్రక్రియగా మారింది. దీంతో UPI ప్లాట్‌ఫారమ్‌లోనూ వివిధ రకాల మోసాలు చోటుచేసుకుంటున్నాయి.
మోసగాళ్ల లక్ష్యాలు
బాధితుల దృష్టిని ఆకర్షించడానికి, మోసగాళ్ళు బ్యాంక్ సిబ్బందిలా నటించి, అప్‌డేట్‌లు, బోనస్ పాయింట్‌లు, క్యాష్ బ్యాక్‌ల వంటి సాధారణ సమస్యల కోసం కాల్ చేస్తారు. కాల్ సహజమైనదే అనిపించడానికి వారు మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్‌ను ధృవీకరించమని అడగడం ద్వారా బ్యాంకర్లు సాధారణంగా చేసే ప్రక్రియను అనుకరిస్తారు.
►మోసగాళ్లు ఒక కథను రూపొందిస్తారు. తద్వారా బాధితుడు సమస్యను పరిష్కరించడానికి వారికి వ్యక్తిగత సమాచారాన్ని అందజేస్తారు.
►మోసగాడు బాధితుడిని వారి ఫోన్‌కు స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని అడుగుతాడు. దాంట్లో భాగంగా TeamViewer, AnyDesk వంటివిPlaystore / App store అందుబాటులో ఉన్నాయి.
OTP మోసానికి మరొక పద్ధతి
►సంక్షిప్త లింక్‌లు, గూగుల్ ఫారమ్‌లతో ఎసెమ్మెస్ ద్వారా లాగిన్, పాస్‌వర్డ్, OTP/UPI డేటాను పూరించమని అడుగుతారు.
►ప్రత్యామ్నాయంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ మొదలైన అప్లికేషన్లలో మోసగాడు (కొనుగోలుదారులా నటించి) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు చెల్లింపు అభ్యర్థనను పంపుతాడు.
►మోసగాళ్లు (కొనుగోలుదారులా నటించడం) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు త్వరగా స్పందించడానికి క్యూఆర్ కోడ్ చెల్లింపు అభ్యర్థనను పంపుతారు
మోసపోకుండా జాగ్రత్తలు
►∙సురక్షిత చెల్లింపు కోసం (https://- URL) ప్యాడ్‌లాక్ సింబల్ చూడండి
►OTP / MPIN నంబర్‌లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ భాగస్వామ్యం చేయవద్దు.
►మీరు ఫోన్‌కాల్‌లో ఉన్నప్పుడు హడావుడిగా చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకండి.
►కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు.
►∙కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు.
►ఫోన్ కాల్‌లో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు,
►ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫోన్లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్‌వేర్‌లను అంటే టఛిట్ఛ్ఛn జ్చిట్ఛ, అnyఈ్ఛటజు, ఖ్ఛీ్చఝ Vజ్ఛీఠ్ఛీట మొదలైన వాటిని ఉపయోగించవద్దు.
►గూగుల్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం శోధించవద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ నుంచి కస్టమర్‌కేర్ నంబర్‌ను తీసుకోవడం సురక్షితం.
-ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment